గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ఈకేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాయి. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో మరో మూడు రోజుల్లో గడువు ముగియనుంది. కావున నెలాఖరులోగా ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించాయి. గ్యాస్ ఏజెన్సీల వద్ద కస్టమర్లు ఆధార్‌ను ఎల్పీజీ ఐడీలతో అనుసంధానం చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయిల్ కంపెనీలు ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే సులువుగా పూర్తి చేసుకోవచ్చని తెలిపాయి.
e-kycకి మరో మూడు రోజులే గడువు