విశాఖపట్నం
ఐఫోన్ కొనివ్వలేదని 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
AP: విశాఖలోని కంచరపాలెం ధర్మనగర్‌లో విషాదం చోటుచేసకుంది. ఐఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తర్వాత కొంటానని చెప్పడంతో బాలిక ఈ దారుణానికి పాల్పడిందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.