📅 18 సెప్టెంబర్ 2026
🔴 బ్రేకింగ్
చిత్తూరు

చెర్లోపల్లెకు కృష్ణా జలాలు..!

చెర్లోపల్లెకు కృష్ణా జలాలు..!

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉన్నా ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలలో అడపాదడపా కురిసిన వర్షాలతో కృష్ణమ్మలో కదలికి వచ్చింది. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని ఎగువ ప్రాంతమైన మాల్యాల నుంచి నీటిపంపింగ్‌ ప్రారంభమైంది. ఆ నీరంతా అనంతపురం జిల్లాలోని జీడిపల్లె రిజర్వాయర్‌ దాటి సత్యసాయి జిల్లాలోని కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. అక్కడి నుంచి వచ్చేనెల 10న హంద్రీ-నీవా జలాలను జిల్లాకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుంగనూరు బ్రాంచి కెనాల్‌ ద్వారా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలకు, కుప్పం బ్రాంచి కెనాల్‌ ద్వారా పలమనేరు, కుప్పం నియోజకర్గాలకు కృష్ణా జలాలను పారించనున్నారు.